త‌మ‌న్నా సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన బుడ్డోడు.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ వారంలో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. అందులో జైల‌ర్ మూవీ రేపు విడుద‌ల కాబోతుండ‌గా.. భోళా శంక‌ర్ ఎల్లుండి రిలీజ్ కానుంది. జైల‌ర్ మూవీ విష‌యానికి వ‌స్తే.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్‌ కుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. క‌న్న‌డ హీరో శివరాజ్‌కుమార్‌, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు.

ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ ర‌జ‌నీకాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే ఈ సినిమాలో `నువ్వు కావాలయ్యా` సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ సాంగ్ కు త‌మ‌న్నా వేసిన స్టెప్స్ నెక్స్ట్ లెవ‌ల్ అనే చెప్పుకోవాలి. గ‌త కొద్ది రోజుల నుంచి ఎక్క‌డ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. త‌మ‌న్నాను అనుస‌రిస్తూ స్టార్ సెల‌బ్రెటీలు సైతం కాలు క‌దుపుతున్నారు.

ఇక తాజాగా ఓ క్రేజీ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో త‌మ‌న్నా సాంగ్ ఓ బుడ్డోడు డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. ఓ స్కూల్ ప్లే గ్రౌండ్‌లో షూట్ చేసిన వీడియో ఇది. ఇందులో కొంతమంది విద్యార్థులు `నువ్వు కావాలయ్యా` అంటూ స్టెప్పులు వేశారు. అయితే అందులో కొంచెం లావుగా ఉన్న బాలుడు మాత్రం.. అచ్చం త‌మ‌న్నాలానే చేస్తూ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాడు. అత‌గాడి డ్యాన్స్ చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ఐదు రోజు క్రితం సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చిన ఈ వీడియో ప్ర‌స్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇప్ప‌టికే ఈ వీడియోకు 8 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్‌, 75 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. మ‌రి లేటెందుకు ఈ వైర‌ల్ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by balram (@balramrj143)