నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మహేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్పలేదు.
ఏకంగా ఆయన పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్పటికీ మర్చిపోని ఓ విలువైన కానుకను అందించారు. అభిమానం అంటే ఇదిరా అనేలా చేశారు. మహేష్ బాబును తాము ఎంతలా ఆరాధిస్తామో స్పష్టంగా చూపించారు. అసలు మహేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు. ఎందుకంటే, ఈ పుట్టినరోజుకు మహేష్ క్రేజ్ అంతరిక్షానికి తాకింది. అవును, ఆయన అభిమానులు ఏకంగా ఆకాశంలో వెలిగే ఒక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ పేరును రిజిస్టర్ చేయించారు.
స్టార్ రిజిస్ట్రేషన్ మహేష్ బాబు పేరిట ఓ నక్షత్రాన్ని నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ లో ఇంత వరకు ఏ హీరోకు అభిమానుల నుంచి ఇలాంటి బహుబతి, గౌరవం దక్కలేదు. ఓ నక్షత్రానికి హీరో పేరు పెట్టడం టాలీవుడ్‍లో ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తానికి అభిమానానికి హద్దులు ఉండవని మహేష్ ఫ్యాన్స్ నిరూపించారు.