గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. `జైలర్` మూవీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ముచ్చటపడుతున్నారు. తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే తమిళనాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి షురూ చేశాడు. జైలర్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల ఈ సినిమా విడుదల సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించారు.
ఆ రేంజ్ లో జైలర్ మ్యానియా కొనసాగుతోంది. మరోవైపు చిత్రటీమ్ ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన జైలర్ ఆడియో లాంచ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ విజయాన్ని బయటపెట్టారు. జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమారు ఓ హీరోయిన్ ముందు తన పరువు మొత్తం తీసేశాని రజనీ వెల్లడించారు. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు రమ్యకృష్ణ.
రజనీకాంత్ రమ్యకృష్ణ కాంబోలో `నరసింహ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఇందులో నీలాంబరి పాత్రలో లేడీ విలన్ గా రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఈ మూవీ తర్వాత మళ్లీ పాతికేళ్లకు జైలర్ లో రజనీ, రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే షూటింగ్ టైమ్ లో జరిగిన సంగతులను తాజాగా రజనీకాంత్ బయటపెట్టారు.
`25 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలిసి జైలర్ లో నటించాను. సినిమాలో మా ఇద్దరి సన్నివేశాలు షూట్ చేస్తున్న టైమ్ లో దర్శకుడు నెల్సన్ ఇది ఎక్కువైంది, అది తక్కువైందని 8 టేక్ లు తీసుకున్నాడు. నీలాంబరి ముందు ఈ నరసింహ పరువు తీసేసాడు` అంటూ రజనీకాంత్ సరదాగా కామెంట్లు చేశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, నరసింహలో రజనీకాంత్ కు విలన్ గా చేసిన రమ్యకృష్ణ.. జైలర్ లో ఆయనకు భార్య పాత్రను పోషించింది. ట్రైలర్ తోనే ఈ విషయంపై స్పష్టత వచ్చింది.