‘ జైలర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్లు… ద‌టీజ్ త‌లైవా… కుమ్మేశాడు…!

తమిళ్ తలైవన్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న‌ రిలీజై ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున ఈ మూవి ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలోనూ బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇక జైలర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.9 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు, కేరళలో రూ5. కోట్లు ఇలా మొత్తం ఇండియాలో రూ.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

తమిళనాడులో రూ.52 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.80 కోట్ల గ్రాస్ ను సంపాదించి కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ మూవీ ఈ ఏడాది తమిళ్ టాప్ మూవీగా రికార్డులు కొల‌గొట్టింది.