భోళాశంక‌ర్‌కు అప్పుడే కొత్త చిక్కులు… తెర‌వెన‌క ఏం జ‌రిగింది…!

వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అనీల్ సుంక‌ర‌, గరికపాటి కృష్ణ కిషోర్లపై మోసం చేశారంటూ ఆరోపించాడు. అతను మాట్లాడుతూ ‘ ఏజెంట్ ‘ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో వాళ్ళు నన్ను మోసం చేశారని రూ.30 కోట్ల డబ్బును తీసుకొని తెలంగాణ, ఆంధ్ర , కర్ణాటకలో మూడు రాష్ట్రాల హక్కులను 5 సంవత్సరాలు పాటు నా గాయత్రీ దేవి ఫిలిమ్స్ కు అందజేస్తానని అగ్రిమెంట్ రాసి ఇచ్చారని ఆ రూ.30 కోట్లు నా బిజినెస్ ఫ్రెండ్స్ సహాయంతో వారి అకౌంట్ కు వైట్ మనీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అంటు చెప్పుకొచ్చాడు.

ఇక ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విడుదల టైంలో కేవలం విశాఖపట్నం వరకు మాత్రమే నాకు హక్కులు ఇచ్చి అగ్రిమెంట్‌కి తూట్లు పొడిచారని ఆ తర్వాత మే 1న హైదరాబాద్‌లో నేను వాళ్ళ ఆఫీసుకు వెళ్లి కలువగా గరికపాటి కృష్ణ కిషోర్ నాతో మాట్లాడుతూ శంకర్ తో మాట్లాడి ఏజెంట్ సినిమాకు ఫైనాన్స్ సమస్యలు ఎదురవడం వల్ల సినిమా డిజాస్టర్ అయ్యింది. మరుసటి రోజు రమ్మన్నారని తర్వాత రోజు వెళ్తే అండర్ టేకింగ్ లెటర్ ఇస్తానని నాకు చెప్పారు ఆ మేరకు నాకు టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమకంతో తిరిగి వైజాక్ వచ్చానని వివరించాడు.

త‌ర్వాత అదే బ్యాన‌ర్లో వ‌చ్చిన ‘ సామజవరగ‌మ‌న‌ ‘ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు విశాఖపట్నం వరకు వచ్చాయి. కానీ దాని ద్వారా కొంతమేరకు డబ్బు మాత్రమే నాకు కవర్ అయిందని 45 రోజుల్లో నాకు ఇవ్వాల్సిన మిగతా డబ్బుని చెల్లిస్తానని ఒకవేళ చెల్లించకపోతే నెక్స్ట్ సినిమా విడుదల లోపు డబ్బు ఇస్తానని ప్రొడ్యూసర్ చెప్పాడని.. నెక్స్ట్ సినిమా ‘ బోళా శంకర్ ‘ రిలీజైన‌ ఇంకా డబ్బులు రాలేదు అంటూ వివరించాడు. ఫిల్మి చాంబర్ పెద్దలకు చెప్పి సంప్రదింపులు జరిపిన ఫలితం లేదని వివరించాడు. రూ.30 కోట్లు తీసుకుని సరిగ్గా సమాధానం చెప్పకుండా ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నారని.. నాపై ఫోర్జరీ కేసు పెట్టి నిందలు వేశారు అంటూ వివరించాడు.

ఏపీ ఎంటర్టైన్మెంట్ వారు యూరో స్ ఇంటర్నేషనల్ వారికి కూడా బౌన్స్ చెక్‌ ఇచ్చి మోసం చేయడంతో వారు కేసు పెట్టారని ఎంతోమందిని మోసం చేసి తమకు ఉన్న గుడ్‌వీల్ పోగొట్టుకుంటున్నారంటూ ఆరోపించాడు. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా గౌరవం అని ఆయన సినిమా విషయం కావడంతో ఇప్పటివరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదని ఎప్పుడైతే నా పైన తప్పుడు నింద వేసి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ అప్రతిష్టలపాలు చేశారో అప్పుడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని నేను ఎంత నిజాయితీగా ఉంటానో అందరికీ తెలుస‌ని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ చెప్పాడు. ఏదేమైనా ఈ ప్ర‌చారం ఈ రోజు రిలీజ్ అయిన భోళాశంక‌ర్‌కు చుట్టుకునేలా ఉంది.