అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘బిజినెస్ మేన్’ బ్లాక్ బస్టర్ రికార్డు.. ఆ ఒక్క చోటే కోటి వ‌సూళ్లు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టార్ సినిమా బిజినెస్ మేన్ 2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక థమన్ అందించిన సాంగ్స్, బిజీఎమ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అస్సలు విషయం ఏమిటంటే ఈనెల 9న మహేష్ బాబు బర్తడే సందర్భంగా బిజినెస్ మేన్ మూవీని పలు థియేటర్లో గ్రాండ్గా రీ రిలీజ్‌కు ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు ఏరియాలో బిజినెస్ మాన్ బుకింగ్ అదరగొడుతుండగా హైదరాబాద్ సిటీలో ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ రికార్డ్ ని అయితే సొంతం చేసుకుంది.

ఈ సినిమా హైదరాబాదులో అత్యధికంగా కోటి అడ్వాన్స్ బుకింగ్స్ దక్కించుకోగా ఈ రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీ టికెట్స్ బుక్ మై షో ద్వారా ఇంత భారీ స్థాయిలో ప్రీ బుక్ కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి బిజినెస్ మేన్ రీ రిలీజ్ లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.