ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. స‌లారే కాదు ఆ మూవీ కూడా రెండు పార్టులే అట‌..!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే మ‌రో గుడ్‌న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

స‌లార్ మాత్ర‌మే కాదు.. ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్‌-కె` కూడా రెండు పార్డులుగా రాబోతుంద‌ట‌. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానిని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటాని వంటి పెద్ద పెద్ద తార‌లు భాగం అయ్యారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమాను కూడా రెండు పార్టులు తెర‌కెక్కించ‌బోతున్నార‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కామిక్‌ కాన్‌ స్టేజ్‌ మీద ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్ గ్లింప్స్ ను అనౌన్స్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అప్పుడే రెండు పార్టుల ప్రస్తావన ఉంటుందనే మాట వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు కామిక్‌ కాన్‌ మీద అంద‌రి ఫోకస్ ప‌డింది. కాగా, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల తేదీని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.