ఆ విషయంలో సుమా కూడా తగ్గేదేలే అంటోందిగా..!

ప్రముఖ బుల్లితెర మహారాణి యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళ నుంచి వచ్చిన ఈమె రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని.. తెలుగింటి కోడలిగా చక్కగా బాధ్యతలు నెరవేరుస్తూ.. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సినిమాలలో ముందుగా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోని సుమ.. బుల్లితెరపై అడుగుపెట్టి యాంకర్ గా మకుటం లేని మహారాణిగా చలామణి అవుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు 15 సంవత్సరాలకు పైగానే అవుతున్నా తన స్థానాన్ని మాత్రం ఆమె చెరగనివ్వడం లేదు అని చెప్పవచ్చు.

ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె సినిమా ఫంక్షన్లకు ఆడియో ఫంక్షన్లకు సుమా లేనిదే అవి జరగవు అనేట్టుగా బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. లక్షల కొద్ది పారితోషకాలు తీసుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న సుమ ప్రతి ఒక్కరికి పోటీగా నిలిచింది. ఇక ఇండస్ట్రీలోకి కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అన్న సామెతను కూడా తిప్పి కొట్టింది. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా తనకు సాటి తానే అని నిరూపించుకుంది. అయితే ప్రస్తుతం ట్రెండుకు తగ్గట్టుగా ఫాలో కావాలి కాబట్టి తాను కూడా గ్లామర్ షో మొదలుపెట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

May be an image of 1 person, dress and text that says "Collabor Collaborationwith Just Like That by Anju"

ఇంస్టాగ్రామ్ లో ఇటు యూట్యూబ్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే తనకు సంబంధించిన ప్రతి ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె తనకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేయడంతో అవి చాలా వైరల్ గా మారుతున్నాయి.

May be an image of 1 person and dress

రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ట్రెండుకు తగ్గట్టుగా తాను కూడా మారిపోవాలని ప్రయత్నం చేస్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇవి చూసిన చాలా మంది సుమ ను ఎవరు ఇలా ఎప్పుడు చూసి ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సుమ ఫోటోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)