ఆ స్టార్ డైరెక్టర్ వల్ల నమిత ఇండస్ట్రీకి దూరం కావాలనుకుందా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య దేవతగా వెలిగిపోయిన ఈ ముద్దుగుమ్మ మొదటిసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. చిన్న వయసు నుంచే నమిత చాలా అందంగా కనిపిస్తూ ఉండేది.. అలా 2018 వ సంవత్సరంలో మిస్ సూరత్ అనే అందాల పోటీలలో పాల్గొని అక్కడ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2021 లో మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొనింది నమిత.. అయితే ఆ ఏడాది మిస్ ఇండియా గా సెలీనా జెట్లీ గెలవడంతో నమిత నాలుగవ స్థానంలో నిలిచింది.

Amazon.com: Sontham : Aryan Rajesh, Namitha, Sunil, Sreenu Vaitla, Ramana  Chintapally, Srinu Vaitla, S.Sompally, V.R.Kanneganti: Prime Video

అయినప్పటికీ ఈ అమ్మకు మంచి అవకాశాలను అందుకుంది. అలా 2002లో సొంతం సినిమాతో మొదటిసారి సినిమా అవకాశాలను అందుకుంది డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నమిత ఆ చిత్రం హీరో ఆర్య రాజేష్ ఇద్దరు కూడా చట్టపట్టలేసుకొని తిరగడం మొదలుపెట్టారట. అయితే ఈ విషయం తెలిసిన శ్రీనువైట్లకు చాలా కోపం వచ్చిందట ఒకసారి ఫారిన్ షూటింగ్లో నమిత మరియు రాజేష్ క్లోజ్ గా ఉండడం చూసి విపరీతంగా వీరిపైన ఫైర్ అయ్యారట.

Srinu Vaitla confident about Mister

దీంతో శ్రీను వైట్లతో నటించే ప్రసక్తే లేదని అప్పుడే ఆమె డిసైడ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సొంతం సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే ఆమెకు జెమిని సినిమాల అవకాశం రావడంతో అందులో కూడా నటించింది ఈ రెండు చిత్రాలు పరవాలేదు అనిపించుకున్న నమితకు మంచి పేరు తీసుకోవచ్చింది. అయితే ఆ తర్వాత నమిత మరో రెండు తెలుగు సినిమాలలో నటించి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడే హీరోయిన్గా సెటిల్ అయింది.