టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్తే ఫ్యాన్స్ కి అదో తెలియని కిక్కు వస్తుంది . దానికి కారణం ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కావచ్చు ..లేకపోతే ఆయన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు ..కారణం ఏదైనా సరే ..ఇద్దరు ఫ్యాన్ బేస్ ని బాగా యూస్ చేసుకున్నాడు రామ్ చరణ్ అనే చెప్పాలి .
కాగా తండ్రి ఎంత పెద్ద స్టార్ హీరో అయినా .. బాబాయ్ అంత హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న..వాళ్ళు అందుకోలేని ఘనత రామ్ చరణ్ రీసెంట్గా అందుకున్నాడు . ఆయన నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది . రీసెంట్గానే రామ్ చరణ్ ఓ పాపకు తండ్రి కూడా అయ్యాడు . ఇలాంటి క్రమంలో రాంచరణ్ కి సంబంధించిన పాత జ్ఞాపకాల తాలూకా వార్తలను ట్రోల్ చేస్తున్నారు కొందరు మెగా హేటర్స్ .
కాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ..మొదటగా స్టార్ హీరో కూతుర్ని అనుకున్నారట . ఆమె మరి ఎవరో కాదు లోక నాయకుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ . అయితే చరణ్ కు ఇదే విషయం చెప్పగా చరణ్ తన ప్రేమ విషయాన్ని చెప్పుతూ ఉపాసన ని ఇంట్రడ్యూస్ చేశారట . దీంతో ఆ మాటలకు సంబంధం అక్కడితోనే ఆగిపోయింది . ఒకవేళ ఉపాసన ని చూడకుండా..? మాట్లాడకుండా..? ఆమెతో ప్రేమలో పడకుండా ఉండి ఉంటే మాత్రం చరణ్ కచ్చితంగా శృతిహాసన్ నే చేసుకునే వాడు అంటున్నారు మెగా అభిమానులు…!!