ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకులు ..కూతుర్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు . ఇప్పటికే చాలామంది తమ ప్లేస్ ని కన్ఫామ్ కూడా చేసుకున్నారు. కాగ అదే లిస్టులోకి వస్తుంది అందాల క్యూట్ బేబీ సితార . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని పేరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయిన సితార.. రీసెంట్గా ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది .
ప్రముఖ్ జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసి అతి చిన్న వయసులోనే క్రేజీ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు ఫస్ట్ టైం సితార ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ యాడ్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ప్రదర్శించబడింది. దీంతో ఈ పిక్చర్స్ ని ..వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్ బాబు . ఈ క్రమంలోనే అసలు పీఎంఆర్ జ్యువెలరీ కోసం చేసిన యాడ్ కోసం సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా చేయలేదు. ఏ సినిమాలోనూ గెస్ట్ పాత్రగా కూడా కనిపించలేదు . అలాంటి సితారకి పీఎంఆర్ జ్యూవెలరీ ఎంత పారితోషికం ఇచ్చి ఉంటుంది అంటూ గెస్ చేస్తున్నారు జనాలు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. సితార ఘట్టమనేని ఈ యాడ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంటూ తెలుస్తుంది . మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకొని కుండానే ఈ యాడ్లో నటించడానికి ఒప్పుకున్నారట . అయితే సదరు సంస్ధ మాత్రం గిఫ్ట్ కింద సితార ఘట్టమనేని కు ఓ డైమండ్ నెక్ సెట్ – రింగ్ – బ్రేస్లెట్ గిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!