రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా కొనసాగుతున్న ట్రెండ్ రీ రిలీజ్ ట్రెండ్ ఆని చెప్పవచ్చు. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేసి బాగానే కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.. ఆ చిత్రమే భైరవద్వీపం. ఈ సినిమాని కూడా తిరిగి రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలో ఈ సినిమా రీ రిలీజ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ని షేర్ చేయడం జరిగింది.

Bhairava Dweepam'

డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో హీరోయిన్గా రోజా బాలయ్య కాంబినేషన్లో వచ్చిన భైరవద్వీపం సినిమా దాదాపుగా ఇప్పటికీ విడుదలై 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. 30 ఏళ్లు చేరువలో దగ్గరగా నేపథ్యంలో ఈ చిత్రాన్ని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 5న 4k క్వాలిటీతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అప్పట్లో ఈ సినిమా విడుదల ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తిరిగి విడుదలవుతూ ఉండడంతో నందమూరి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Nandamuri Balakrishna's "Biravadeepam" Set for Grand Re-release!

ఇక బాలయ్య నటించిన గతంలో చిత్రాలు చెన్నకేశవరెడ్డి సినిమాని కూడా తిరిగి రీ రిలీజ్ చేయాగా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక వీర సింహారెడ్డి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న బాలయ్య ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావు పూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయాలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు బాలయ్య.