శృంగారం గురించి బోల్డ్ పోస్ట్ షేర్ చేసిన యాంకర్ రష్మి.. షాక్‌లో అభిమానులు…

జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది యాంకర్ రష్మీ గౌతమ్. బుల్లితెరపై యాంకరింగ్ చేయడంతోపాటు, సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు రష్మి, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అయితే బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ అడపాదడపా కామెడీ పంచ్‌లతో కనిపించే రష్మి వేరు, ఆఫ్-స్క్రీన్‌లో రష్మి వేరు. ఆమెలో మరొక కోణం కూడా ఉంది. రష్మి జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో, రష్మి జంతువులపై తన ప్రేమను వ్యక్తం చేసింది.

జంతు హింసకు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, రష్మీ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తుంది. అదేవిధంగా, రష్మి సామాజిక అంశాల గురించి మాట్లాడటానికి కూడా వెనుకాడదు. ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. తాజాగా, రష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్ట్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

శృంగారం, డేటింగ్ గురించి రష్మి పెట్టిన పోస్ట్ చాలా బోల్డ్‌గా ఉండటమే ఇందుకు కారణం. డేటింగ్ కల్చర్ వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో వివరించే శృంగార దృశ్యాల డ్రాయింగ్‌ను రష్మి పోస్ట్ చేసింది. ఆ దృశ్యాలు ప్రజలు ఒకరితో కాకుండా చాలామందితో శృంగారం చేస్తున్నట్లు చూపించాయి.

ఈ ఫొటోలో.. “డేటింగ్ సాంప్రదాయం వల్ల ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. సంబంధాలు, వావి వరసల గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ సెక్స్‌ని అనుభవించడంలో బిజీగా ఉన్నారు. దేవుడు నిజమైన ప్రేమను పొందండి అని మంచి మార్గంలో పంపుతుంటే, రాక్షసత్వమైన కోరికలతో ప్రేమను తిరస్కరిస్తున్నారు. విషపూరితమైన సంబంధాలు ఒక సైకిల్ లా మన చుట్టూ ఏర్పడ్డాయి” అని అందులో ఉంది. రష్మి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రష్మి చేసిన ఈ పోస్ట్‌తో చాలా మంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. బ్యూటిఫుల్ యాంకర్ అడపాదడపా మతపరమైన అంశాల గురించి కూడా పబ్లిక్‌గా కామెంట్ చేస్తుంటుంది. వీటివల్ల కొన్నిసార్లు, ఆమె ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది.