నిహారిక అలా చేసిందా.. ఆమెపై మాజీ భర్త తండ్రి సంచలన వ్యాఖ్యలు నిజమేనా?

టాలీవుడ్‌లో ప్రస్తుం కొణిదెల నిహారిక విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. విడాకులకు అసలు కారణమేంటో తెలియదు. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె పెళ్లి 2020 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగింది. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇటీవల వీరిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేసేశారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసుకున్నారు.

తర్వాత జులై 5న వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసేసింది. దీంతో ఇద్దరూ చట్ట ప్రకారం విడిపోయారు. ఆ తర్వాత అసలు వీరిద్దరి విడాకులకు అసలు కారణం ఏమిటా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నిహారిక గురించి ఆమె మాజీ భర్త తండ్రి తన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

జొన్నలగడ్డ చైతన్య తండ్రి ప్రభాకరరావు సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన రిటైర్డ్ ఐజీ. ఆ కుటుంబంతో గతంలో సంబంధం కుదుర్చుకోవాలని తాము అనుకున్నా, కుదరలేదని చిరంజీవి గతంలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నిహారికను వారి కుటుంబానికి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అలాంటి ప్రభాకరరావు ఈ విడాకుల విషయంలో, ముఖ్యంగా నిహారిక ప్రవర్తన గురించి చాలా బాధ పడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సన్నిహితుల వద్ద ఆమె ఇంట్లో ఎలా ప్రవర్తించేదో చెప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. తరచూ సోషల్ లైఫ్ పేరుతో ఆమె పబ్‌లకు వెళ్తుందని, దీనిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని వాపోయారు. ఇక వారిద్దరినీ వేరుగా ఫ్లాట్ లో ఉంచినా పరిస్థితి మారలేదని చెప్పారట. దీనిని పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించాలని, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని బాధపడ్డారట. దీంతో అత్తమామలను తన ప్రవర్తనతో ఆమె ఇబ్బంది పెట్టిందనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా వీరిద్దరి విడాకుల వ్యవహారం ఇరువురి ఇళ్లలో బాధాకరంగా మారింది.