తండ్రి చిరంజీవి సినిమాని కాపీ చేసి హిట్ కొట్టిన రామ్ చరణ్.. ఏ మూవీనో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ ఎలాంటి స్టేటస్ అందుకొని ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని.. హాలీవుడ్ డైరెక్టర్ తో సైతం సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి చిన్న వార్తను సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం సినిమా ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకి సీక్వెల్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నాని .. వై రవిశంకర్ మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సుకుమార్ . ఈ సినిమాలో చరణ్ కి జోడిగా నటించింది సమంత .

కాగా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సొంతం చేసుకున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన “జాతర” అనే సినిమాకు కాపీ అంటూ జనాలు చెప్తున్నారు .ధవళ సత్యం ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి చేసిన చిత్రం జాత‌ర‌. ఇంద్రాణి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీధర్, నాగభూషణం, జయలక్ష్మి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. 1980 లో రిలీజ్ అయిన ఈ సినిమా సేమ్ రంగస్థలం సినిమాకు చాలా దగ్గర పోలికలు ఉంటాయని.. రెండు సినిమా స్టోరీలు దాదాపు ఒకేలా ఉంటాయి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోని నాన్న సినిమాను కాపీ కొట్టి హిట్టు అందుకున్నాడు చరణ్ అంటూ వార్తలు వైరల్ గా మారాయి..!!