ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఇతనేనా..?

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా అంతే తొందరగా ఫీడ్ అవుట్ అయిందని చెప్పవచ్చు. ఇలియానా కెరియర్లో పోకిరి, దేవదాసు, ఆట, ఖతర్నాక్ సినిమాలు ఇమే కెరీర్నే మార్చేశాయి. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇలియానా అడుగుపెట్టి పెద్ద తప్పు చేసింది.. అక్కడ బర్ఫీ అనే చిత్రంలో నటించిన ఇలియానా ఆ తర్వాత అడపాదప సినిమాలను నటించింది. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇమెను పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తర్వాత అవకాశాలు తగ్గుతూ ఉండడంతో ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ తో ఈ అమ్మడు చట్టపట్టలేసుకొని తిరిగేసింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బ్రేకప్ అవ్వడంతో కొంతకాలానికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఇలియానా.. కొన్ని రోజులకు మళ్లీ ఒకటి రెండు సినిమాలలో చేసిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. గత కొద్దిరోజులుగా ఇలియానా గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా తెలియజేసింది. దీంతో అందరు షాక్ అయ్యారు. ఇక ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరైనా ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనేది ఫేస్ రివిల్ చేయకుండా హాండ్స్ ఫోటోలతో ఒక క్లారిటీ ఇచ్చింది ఇలియానా. వేరొక వ్యక్తితో ఇప్పటికే తనకు ఎంగేజ్మెంట్ అయినట్టుగా డైమండ్ రింగ్స్ పెట్టుకొని ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోకి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది.. తన రొమాంటిక్ ఐడియాతో ప్రశాంతంగా అతనిని తీనివ్వలేదు అంటూ అర్థం కాని విధంగా పోస్ట్ షేర్ చేసింది ఇలియానా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారుతోంది. గత కొంతకాలంగా కత్రినా కైఫ్ బ్రదర్ తో ఇలియానా లవ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. మరి అతనే అయ్యుండవచ్చు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.