చేతుల్లారా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న రవితేజ.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మహేశ్ బాబు..ఆ సినిమా ఇదే..!!

టైం బాగోలేకపోతే ..ఎప్పుడు ఏదైనా జరగొచ్చు ..అది ఎక్కడైనా సరే . అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రాత్రికి రాత్రి స్టార్ హీరోల ఉన్న స్టార్ మన ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే అట్టర్ ఫ్లాప్ అయిపోయి దివాలా తీసిన హీరోలు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎలాంటి డిజాస్టర్లైన ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తెలిసి తెలియక తనంతో చేసిన తప్పులు కారణంగా ఇండస్ట్రీలో ఫేడౌట్ హీరోగా మారిపోయాడు మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న రవితేజ.

ప్రజెంట్ మాస్ హీరో రవితేజ కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు పడుతూ డిజాస్టర్ కా బాప్ అంటూ డిజాస్టర్ హీరో లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు . అయితే రవితేజ గతంలో ఓ సినిమాని చేతులారా మిస్ చేసుకున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది. అది మహేష్ బాబు చేసి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మలుచుకున్నాడు. ఆ సినిమా మరి ఏదో కాదు పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కిన “పోకిరి”.

మహేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా రికార్డులు నమోదు చేసిన పోకిరి.. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది . అప్పటివరకు చాలా క్లాస్ సైలెంట్ హీరోగా ఉన్న మహేష్ బాబుని మాస్ యాంగిల్ లో చూపించి పూరి జగన్నాథ్ సంచలనానికి తెరలేపారు. ఇంకా పక్కాగా చెప్పాలంటే ..వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న మహేష్ బాబుకి సెకండ్ లైఫ్ ఇచ్చింది పోకిరి అని చెప్పాలి. ఇప్పటికి పోకిరి సినిమాలోని డైలాగును మనం రెగ్యులర్ లైఫ్ లో వాడుతూనే ఉంటాం . అంత మంచి సినిమాని మిస్ చేసుకుని రవితేజ చాలా పెద్ద తప్పు చేశాడు అన్న న్యూస్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది. ప్రెసెంట్ మహేష్ బాబు రవితేజ ఎలాంటి పొజిషన్లో ఉన్నారో తెలిసిందే. టాప్ మోస్ట్ లో మహేష్ బాబు ఉంటే ఒక్క హిట్ కోసం అల్లాడిపోతున్నాడు రవితేజ..!!