ఆ టైంలో నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపించింది” .. రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పలు సినిమాలకు స్టోరీస్ రాస్తూ క్రేజ్ సంపాదించుకున్న ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన ఓ వేదికపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ “ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకొనందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అనిపించింది” అంటూ స్టేజి పైన మాట్లాడుతూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

నైజాం విముక్త స్వాతంత్ర అమృత మహోత్సవాల శుక్రవారం హైదరాబాదులోని ఎఫ్ ఎఫ్ సి సి లో జరిగాయి . ఈ క్రమంలోనే నైజాం కి వ్యతిరేకంగా పోరాడిన వీరులను స్మరించుకున్నారు పెద్దలు. నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన వీరులు కుమురం భీమ్‌, రాంజీ గోండ్‌, షాయబుల్లాఖాన్‌, జమలాపురం కేశవరావు, చాకలి ఐలమ్మ వంటి వారి పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ వేడుక నిర్వహించారు పెద్దలు . ఇందులో బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా పాల్గొని తన విలువైన మాటలను అభిమానులకి వినిపించాడు.

ఈ క్రమంలోని ఆయన మాట్లాడుతూ..” ఆర్ఎస్ఎస్ పై ఓ సినిమా తీస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఐదేళ్ల ముందు వరకు తనకు ఆర్ఎస్ఎస్ అంటే పెద్దగా తెలియదని ..దాని గురించి పెద్ద అవగాహన లేదని ..అందరిలానే నేను కూడా దానిపై తప్పుగా ఊహించుకున్నానని .. భారత దేశంలో చాలామందికి ఉన్న అభిప్రాయమే తనకి ఉండిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు గాంధీని హత్య చేసిన దాంట్లో ఈ సంస్ధ కి సంబంధం ఉందని భావించానని చెప్పుకొచ్చారు . అయితే ఐదేళ్ల క్రితం మోహన్ భగవత్ ని కలిసిన తర్వాత తాను చాలా రియలైజ్ అయ్యానని ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తాను ఈ సంస్ధ గురించి తెలుసుకోనందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలనిపించింది అని షాకింగ్ కామెంట్స్ చేశారు”. దీనితో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

Share post:

Latest