ర‌ష్మిక కంటే నాకే ఆ పాత్ర బాగుంటుంది.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ టాలెంటెడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ `ఫర్హానా` తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. మే 12న తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రను పోషించిన రష్మికపై షాకింగ్ కామెంట్స్‌ చేసింది.

రష్మిక కంటే ఆ పాత్ర తనకే బాగుంటుందని కుండ బద్దలు కొట్టేసింది. `నాకు పుష్పలో అవకాశం వచ్చి ఉంటే.. తప్పకుండా చేసేదాన్ని. శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో రష్మిక బాగా నటించారు. కాకపోతే ఆ రోల్ నాకు ఇంకా బాగా సెట్ అవుతుందని నా నమ్మకం. ఇక తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా న‌న్ను తెలుగు వారికి ద‌గ్గ‌ర చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో నాకు ఆఫర్స్ వ‌స్తున్నాయి. కానీ, మంచి పాత్ర‌ల కోసం ఎదురు చూస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వ‌ర్య కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest