ఎక్స్ప్రెషన్ క్వీన్ గా పాపులారిటీ సంపాదించుకున్న మలయాళ బ్యూటీ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో.. తన అల్లరితో.. సినిమా ఇండస్ట్రీలో పలు రోల్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్న ఈమె రాజారాణి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది . అఫ్కోర్స్ ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా సరే తెలుగు జనాలు బాగా ఆదరించారు . ఆమె నటనను బాగా ఎంకరేజ్ చేశారు. నజరియా ఇమేజ్ ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు .
అప్పటివరకు ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ గానే ఉన్న నజ్రీయ నజీమ్ ఈ సినిమాతోని నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని నటించిన” అంటే సుందరానికి” సినిమాతో మళ్లీ తెరపై మెరిసింది . ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగులో మంచి కం బ్యాక్ ఇస్తుందని ఆశపడింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీ వైపు చూడడమే మానేసింది . తెలుగులో సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వచ్చిన నజ్రీయ నజీమ్ రీసెంట్గా షాకింగ్ న్యూస్ ని అభిమానులకు అందించింది .
సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయిందట . ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈమెరకు ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు . ఆ పోస్టులు ” నేను నా అన్ని సోషల్ మీడియా ఖాతా ప్లాట్ఫామ్స్ కి బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ సందేశాలను చాలా మిస్ అవుతున్నాను . నేను ప్రయాణం చేస్తున్నాను ” అంటూ పోస్ట్ పెట్టుకు వచ్చింది . ఈ క్రమంలోనే నజ్రియా తెలుగు ఫాన్స్ బాధపడిపోతున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆయన నిన్ను చూసే వాళ్ళమని ఇప్పుడు అది కూడా చూడలేకపోతున్నాము అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో నజ్రియా నజీమ్ అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చినట్లయింది.