గోపీచంద్ వైవాహిక బంధానికి 10 ఏళ్లు.. మ్యాచో స్టార్ స‌తీమ‌ణి గురించి ఈ విష‌యాలు తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కి స‌రైన హిట్ ప‌డి చాలా కాలం అయిపోయింది. రీసెంట్ గా విడుద‌లైన `రామబాణం` కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచింది. అయినాస‌రే గోపీచంద్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గోపీచంద్ కు ఈ రోజు చాలా స్పెష‌ల్‌.

ఎందుకంటే, ఆయ‌న వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటికి ప‌దేళ్లు అవుతోంది. ఈ సంద‌ర్భంగా గోపీచంద్ త‌న భార్య రేష్మతో క‌లిసి వెకేష‌న్ కోసం ప్యారిస్ వెళ్లారు. అక్క‌డే త‌మ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా గోపీచంద్ పంచుకున్నాడు. `ఇన్నాళ్లూ నీతో కలిసి చేసిన ప్రయాణం అద్భుతమైనది. నిన్ను నా భార్యగా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు` అంటూ శ్రీ‌మ‌తికి స్వీట్ గా విషెస్ తెలిపాడు.

గోపీచంద్ మ‌రియు ఆయ‌న‌ స‌తీమ‌ణికి అభిమానులు, నెటిజ‌న్లు సైతం యానివర్సరీ విషెస్ చెబుతున్నారు. ఇక గోపీచంద్ వైఫ్ రేష్మ విష‌యానికి వ‌స్తే.. రేష్మ మరెవరో కాదు సీనియర్ నటుడు శ్రీకాంత్ సొంత మేనకొడలు. ఆయన సొంత అక్క కూతురినే గోపీచంద్ 2013లో పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో చదువుకున్న రేష్మ.. పెళ్లి త‌ర్వాత సంపూర్ణ గృహిణిగా మారింది. ఈ దంపుతుల‌కు ఇద్ద‌రు కుమారులు కూడా జ‌న్మించారు.

Share post:

Latest