అమ్మల చేతిలో గ‌ట్టిగా దెబ్బలు తిన్న‌ టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!

అమ్మను మించిన దైవం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరోల వెనుక వారి అమ్మలు ఎంతో సపోర్టుగా నిలిచారు. హీరోలు, హీరోయిన్ల అమ్మలు ఆయా హీరోల కెరీర్ ప‌రంగా సక్సెస్ అవ‌డానికి తమ వంతు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అయితే అదే సమయంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారి అమ్మల చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో, హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Here's how man of masses Jr NTR's mother ignited his passion for Indian  classical dance | Telugu Movie News - Times of India

ముందుగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి.. తార‌క్ చిన్న వయసులో అల్లరి పనులకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్‌ చేసిన‌ అల్లరి పనిలానూ తట్టుకోలేక ఎన్టీఆర్ తల్లి షాలిని ఎన్నోసార్లు బెల్ట్ తో కొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని తారక్ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకసారి ట్రాన్స్ ఫార్మర్ లో బల్బు పెట్టి అది పేలేలా చేశానని.. తాను చేసిన పని వల్ల మూడు రోజులు కరెంట్ లేదని తారక్ అన్నారు. ఈ విషయం అమ్మకు తెలీకుండా మేనేజ్ చేశానని ఎన్టీఆర్ వెల్లడించారు.

No photo description available.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తల్లి చేతిలో దెబ్బలు తిన్నారట.. బ‌న్నీ అమ్మ ఎప్పుడు ఎగ్జామ్స్ గురించి అడిగిన‌ తప్పుగా చెప్పడంతో వాళ్ళ అమ్మా ఎప్పుడు దెబ్బలు కొట్టేదట. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ ప‌లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒక సందర్భంలో తన చేతిలో దెబ్బలు తిందట. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌ కూడా బాలయ్య కారణంగా తన తల్లి చేతిలో దెబ్బలు తిన్నానని తాజా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Sai Pallavi Family Pictures with mother brother - YouTube

అలాగే మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సైతం తన చదువుకునే రోజుల్లో తన తల్లి చేతులు దెబ్బలు తిన్నారట. బబ్లీ బ్యూటీ హన్సిక కూడా చిన్నతనంలో తన తల్లి చేతిలో దెబ్బలు తిందట.. తన తల్లి యోగ చేసే సమయంలో డిస్టర్బ్ చేయడంతో హన్సికా తన తల్లి చేతిలో దెబ్బలు తిన్నారట. మరో యంగ్ హీరో మనోజ్ సైతం చిన్నప్పుడు తల్లి చేతిలో దెబ్బలు తిన్నాడట. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు త‌మ అమ్మ‌ల‌ చేతిలో దెబ్బ‌లు తిన్నోళ్లు ఇంకా ఉన్నారు.

Share post:

Latest