ఆ విషయంలో ఇప్పటికీ బాధ‌ప‌డుతున్నా…. పెళ్లిరోజు జ‌రిగిన‌ గొడ‌వ‌ బయటపెట్టిన కత్రినా..!

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జంట కూడా ఒకటి. ఈ ఇద్దరు ముందుగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ లోనే అగ్ర న‌టులుగా ఉన్న వీరు పెళ్లి చేసుకోవడంతో వారి అభిమానులను ఎంతో ఆనందింప చేసింది. ఇదే సమయంలో రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో కత్రినా తమ పెళ్ళిలో జరిగిన ఓ సీక్రెట్‌ను బయటపెట్టింది.

Katrina Kaif on Vicky Kaushal: I didn't even know much about him, he was  just a name I had heard-Entertainment News , Firstpost

కత్రినా మాట్లాడుతూ..” మా పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగింది. మేము అనుకున్న దానికన్నా డబుల్ రేంజ్ లో పెళ్లి జరగడం ఒక ఆనందమైతే ..ప్రతి పని సాంప్రదాయ బద్ధంగా చేసుకోవడం మనసుకు హాయిగా అనిపించింది. అంతేకాదు పెళ్లి ఫిక్స్ అయిన ముహూర్తం ద‌గ్గ‌ర నుంచి మేము అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాం”. ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా మా పెళ్ళికి వచ్చిన వారందరికీ కడుపునిండా భోజనం పెట్టేలా.. మీడియా వారికి ఇబ్బంది లేకుండా చూడాలని అనుకున్నాం.

Vicky Kaushal says his marriage with Katrina Kaif is 'sorted'; Jokes about  conflict in reel-life relationships | PINKVILLA

అయితే నా పెళ్లి అని అనుకున్నట్టుగా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.. నేను విక్కీ కౌశల్ ఎంతో హ్యాపీగా ఉన్నాం.. నా మెడలో తాళి కట్టేసాడు ఏడ‌డుగులు వేసేసాం.. అంతా మేం అనుకున్నట్టే జరిగింది మా లైఫ్ కలర్ ఫుల్ గా ఉండబోతుందంటూ అందరూ ఆనందిస్తున్నాం.. సడన్గా మా వెనుక నుంచి ఏవో గట్టిగా అరుపులు ఏంటా అని అవి తిరిగి చూసేసరికి జుట్టును పట్టుకుని చెప్పులతో కొట్టుకుంటున్నారు.

Vicky Kaushal and Katrina Kaif to have a royal three-day wedding, will tie  the knot on December 9

ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాం.. “అక్కడ చెప్పులతో కొట్టుకున్నది విక్కీ స్నేహితుడు, నా చెల్లెలు. అయితే అది సరదా గొడవనుకుని లైట్ తీసుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది అది సీరియస్ గొడవ అని. కానీ ఇప్పటికీ ఆ గొడవని నేను కంక్లూడ్ చేయలేకపోయాను “అంటూ చెప్పుకువచ్చింది. దీంతో కత్రీనా కామెంట్స్ వైరల్ గా మారాయి. అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..?

Share post:

Latest