అనుష్క అంటే చరణ్ కి అంత ఇష్టమా..? సినిమా హిట్ అవ్వాలని ఏం చేసాడొ తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి ..తాజాగా నటిస్తున్న సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు . ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు మహేశ్ పి. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి కామెడీ లైన్ తోనే డిజైన్ చేసిన ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

మరి ముఖ్యంగా అనుష్క – నవీన్ పోలిశెట్టి నటన టూ గుడ్ గా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అంతేకాదు అనుష్క శెట్టిని ఓ రేంజ్ లో ఎంకరేజ్ చేయడానికి పలువురు స్టార్స్ ఆమె నటిస్తున్న సినిమా ని ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గానే పాన్ ఇండియా హీరో ప్రభాస్ – అనుష్క – నవీన్ పోలిశెట్టి కు స్పెషల్ గా గుడ్ లక్ చెప్పారు .

ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ సైతం టీజర్ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గుడ్ లక్ చెప్పకు వచ్చాడు . “మనసుకు చాలా రిఫేష్ గా అనిపిస్తుంది . చిత్ర యూనిట్ కి నా గుడ్ లక్ “అంటూ ట్వీట్ చేశాడు . ఈ క్రమంలోని మొదటి నుంచి అనుష్క అంటే చరణ్ కి చాలా ఇష్టం అని..

ఆమెతో ఓ సినిమా రావాల్సిందని అయితే అనుకొని కారణాలు చేత సినిమా ఆగిపోయిందని.. దీంతో అనుష్కను ఈ విధంగా ఎంకరేజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు అంటున్నారు జనాలు. ఏది ఏమైనా సరే ఇంతమంది స్టార్ హీరోస్ ప్రోత్సహిస్తూ ఉంటే ఈ సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది కచ్చితంగా హిట్ అవుతుంది అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఈ సినిమా ఏ రేంజ్ లో జనాలను మెప్పిస్తుందో..?

 

 

 

Share post:

Latest