“అఖిల్ ఏజెంట్ ఫ్లాపే” .. నాగ చైతన్య డేరింగ్ కామెంట్స్ కి సినీ ఇండస్ట్రీ షాక్..!!

పాపం.. తాను ఒకతి తలుచుకుంటే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు అక్కినేని అఖిల్ ఎంతో కష్టపడి భారీ రేంజ్ లో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా కూడా డిజాస్టర్ గా మారింది . సురేందర్ రెడ్డి డైరెక్షన్ తెరకెక్కిన ” ఏజెంట్ ” సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు . దీనికోసం సిక్స్ ప్యాక్ కూడా పెంచారు . అయితే ఏం లాభం సినిమాలో కంటెంట్ లేదని జనాలు ఈ సినిమాని ఫ్లాప్ చేశారు . మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే ఈ ట్రోలింగ్ వ్యవహారం కాస్త నాగచైతన్య ప్రమోషన్స్ వరకు వెళ్ళింది . వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సినిమా “కస్టడి” . మే 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్షన్ అయిన నాగచైతన్యకు తమ్ముడు అఖిల్ సినిమా ఫ్లాప్ పై ప్రశ్న ఎదురయింది .

“ఈ మధ్యకాలంలో మీ ఇంటి నుంచి వస్తున్న హీరోల సినిమాలన్నీ ప్లాప్ అయిపోతున్నాయి ..దానిపై మీ స్పందన ఏంటి ..? “అంటూ అడిగారు రిపోర్టర్. ఈ క్రమంలోని ” ఇప్పటివరకు మా పై జనాలు చూపిస్తున్న ప్రేమ మేము వెలకట్టలేనిది ..సినిమా ఇండస్ట్రీలో అందరూ సినిమా హిట్ అవ్వాలని సినిమాలు చేస్తూ ఉంటారు ..కొన్నిసార్లు అవి మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి.. ఆ కోవాలోకి ఏజెంట్ వస్తుందని అనుకుంటున్నాను ..మా కస్టడీ సినిమా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను” అంటూ చాలా కూల్ అండ్ క్లాసిక్ గా ఆన్సర్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు.

నిజానికి గత కొంతకాలంగా నాగచైతన్య అఖిల్ కు మధ్య గొడవలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే అఖిల్ సినిమా ఫ్లాప్ అంటూ వచ్చిన వార్తలు పై కూడా నాగచైతన్య నెగటివ్గా రియాక్ట్ అవుతారు అని అంతా అనుకున్నారు . కానీ నాగచైతన్య చాలా తెలివిగా డేర్ గా ఆన్సర్ ఇచ్చారు. దీంతో మరోసారి నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

Share post:

Latest