బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన సంయుక్త‌.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్‌!?

టాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. సాయి ధరమ్ తేజ్‌ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇప్పుడు విరూపాక్షఇత‌ర భాష‌ల్లో విడుదల అయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంయుక్త మీనన్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింద‌ట‌. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని ద‌క్కించుకుందట. ఇంతకీ ఆ స్టార్ హీరో మ‌రెవరో కాదు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ మూవీ అనంత‌రం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడట. ఆల్రెడీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశాడట. ఇక‌ ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్‌ ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సంయుక్త ద‌శ తిరిగిన‌ట్లే అని టాక్‌ నడుస్తోంది.

Share post:

Latest