తమన్నాని పెళ్లి చేసుకోవాలంటే ముందు తల్లికి నచ్చాలంట… ఏం కండిషన్స్ పెట్టిందంటే..

ప్రముఖ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే గతకొద్ది రోజులుగా ఈ మిల్కీ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల కారణంగా వార్తలలో నిలుస్తుంది. తమన్న, ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వస్తున్న వర్తలకు తగ్గట్టుగానే తమన్నా, విజయ్ వర్మ కలిసి ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఇద్దరు కలిసి ముంబై వీధుల్లో ప్రేమ పక్షులా విహారిస్తున్నారు. వీరిద్దరూ ‘లవ్ స్టోరీ 2 ‘ అనే సిరీస్‌లో చాలా బోల్డ్ సన్నివేశాలో నటించారు. అలాంటి సీన్స్ లో కనిపించడంతో వారి మధ్య ఏదో రిలేషన్ కచ్చితంగా ఉంది అంటూ కొంతమంది అంటున్నారు. అంతేకాకుండా వారి ప్రేమ విషయాన్ని తొందర్లోనే అధికారికంగా ప్రకటిస్తారు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే వారిపై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ తాము స్నేహితులం మాత్రమే, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదు అని అంటున్నారు విజయ్, తమన్నా.

అయితే తమన్నాని పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఆమె తల్లి పెట్టిన కండిషన్స్ ని ఒకసారి వినక తప్పదట. ఆ కండిషన్స్ కి ఒకే అంటేనే తమన్నా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమన్నా చిన్నప్పటినుండి చాలా సెన్సిటివ్ గా పెరిగిందట. కాబట్టి ఆమెని పెళ్లి చేసుకోబోయేవాడు తమన్నాకి కష్టం కలిగించకుండా, తనకి నచ్చిన విధంగా ఉండనివ్వాలని తల్లి తెలిపారు. అంతేకాకుండా తమన్నాకి ఇష్టం లేని పనులు చేయకూడదనే కండిషన్ కూడా పెట్టారు. మరిఈ కండిషన్స్ కి ఒకే చెప్పి తమన్నాని పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.