“విరూపాక్ష” సినిమా హిట్ అవ్వడం సాయి ధరమ్ తేజ్ కి మైనస్ గా మారిందా..? మెగా హీరోకి కొత్త తల నొప్పులు మొదలైయాయే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కున్న స్పెషల్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే . కేవలం హీరో గానే కాదు కంటెంట్ ఉన్న సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధపడిన సాయిధరమ్ తేజ్ రీసెంట్గా నటించిన విరుపాక్ష సినిమాతో ఎంతటి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడో మనందరికీ తెలిసిన విషయమే . ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా సినీ ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది . కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీస్తేనే కాదు సింపుల్ కథతో కూడా సినిమా తీస్తే జనాలు ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఈ క్రమంలోనే “విరుపాక్ష” సినిమా హిట్ అవ్వడం కూడా సాయిధరమ్ తేజ్ కి మైనస్ గా మారింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఎందుకంటే విరుపాక్ష సినిమాలో సాయి ధరంతేజ్ చాలా సైలెంట్ రోల్. తన పని తాను చూసుకుపోతూ ఉంటాడు . మరీ ముఖ్యంగా సంయుక్త ప్రేమ కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాడు . అయితే ఈ సినిమా లాస్ట్ లో క్రేజ్ మొత్తం తీసుకెళ్లే సంయుక్త మీనన్ కి పెట్టేశాడు డైరెక్టర్. కథ ప్రకారం ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా సంయుక్తనే.

ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ హీరోగా మాత్రమే కనిపించాడు . ఈ సినిమా ఎండ్ లో విరుపాక్ష 2 కూడా ఉంది అనే విధంగా చూపిస్తారు . అయితే విరుపాక్ష 2 లో సంయుక్త మీనన్ ఉండదు . ఎందుకంటే సంయుక్తని చంపేస్తారు. ఈ క్రమంలోనే విరుపాక్ష2 సినిమా మొత్తానికి మెగా హీరోనే హైలెట్ చేసే విధంగా కథను రాసుకుంటున్నారట సుకుమార్. ఒక వేళ అదే జరిగితే ఖచ్చితంగా ఈ సినిమాకి నెగిటివ్ టాక్ కంపల్సరీ వస్తుంది అన్న కామెంట్లు వినపడుతున్నాయి. సమ్యుక్తా లేకుండా విరూపాక్ష 2 కి ఆ క్రేజ్ రాదు. ఈ క్రమంలోనే విరుపాక్ష సినిమా హిట్ అయినా సరే మెగా హీరోకి కొత్త తలనొప్పులు తప్పవు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి “విరుపాక్ష” 2 గండం నుంచి సాయి ధరమ్ ఎలా బయటపడతాడో..?