అక్కినేని హీరోల బ్యాడ్ టైం పై షాకింగ్ కామెంట్లు చేసిన చైతు..!!

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది. అయితే ఈ మధ్య ఆ ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోందనే చెప్ప వచ్చు.. వారు నటిస్తున్న ప్రతి సినిమా డిజార్డర్ గానే మిగులుతోంది. నాగార్జున మొదలు అఖిల్ వరకు అన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగులుతున్నా..వీరి సినిమాలు సక్సెస్ అయ్యాయి అనే మాట విని చాలా కాలం అవుతోంది. నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి.

Samantha-Naga Chaitanya To Nagarjuna-Lakshmi; Is The Akkineni Family Jinxed  In Relationships, Fans Wonder - Filmibeat

దీంతో అక్కినేని ఫ్యామిలీ కి ఏదో శాపం తగిలింది అంటూ వార్తలు కూడా వినిపించాయి..ఇప్పుడు నాగచైతన్య నటిస్తున్న కష్టడీ చిత్రంఈనెల 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న చైతుకు ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది. అదేంటంటే అక్కినేని అభిమానులు ఏడాది కాలంగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అని చైతుని ప్రశ్నించగా.?

దీనికి చైతు సమాధానం ఇస్తూ అభిమానులకు మేము ఎప్పుడు సక్సెస్లే ఇవ్వాలనే కోరుకుంటాము. మా తరఫున ఎప్పుడు మద్దతుగా నిలబడతారు. మా అభిమానులు వారికి బహుమతిగా మేము మంచి సినిమాలనే ఇవ్వగలం అయితే ఈ మధ్యకాలంలో మేము చేసే సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎవరి జీవితంలోనైనా ఒడిదలకు సహజం.. అలాగే ఎప్పుడూ సక్సెస్ లు రావాలనుకోవడం మన ఆశ కానీ ఒక్కొక్కసారి గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి దానిని మనము అంగీకరించక తప్పదు.. త్వరలోనే ఈ బ్యాడ్ టైం కి పుల్ స్టాప్ చెప్తాం కస్టడీతోనే అది ప్రారంభం అవుతుందని నేను బాగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest