వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎంద‌రో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వ‌య‌సున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు.

ntr and hrithik roshan in war2

కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా అరుదు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు. ఇంతకీ ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు భూమిక. ఎన్టీఆర్- భూమిక మొదటిసారిగా నటించిన సినిమా సింహాద్రి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో భూమికతో పాటు అంకిత కూడా మరో హీరోయిన్‌గా నటించింది.

Bhumika Chawla & Jr Ntr Blockbuster Action Scene | Telugu Interesting Scene  | Telugu Videos - YouTube

2003లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే భూమిక వ‌య‌సులో చాలా పెద్ద‌ది. వీరిద్ద‌రి మ‌ధ్య ఐదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అంటే ఎన్టీఆర్ కంటే భూమిక ఐదేళ్లు పెద్ద‌ది అన్న‌మాట‌. సింహాద్రి సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్- భూమిక సాంబ సినిమాలో మరోసారి కలిసి నటించారు. అలా ఎన్టీఆర్ తనకంటే వయసులో ఐదేళ్లు పెద్దదైన భూమికతో రెండు సినిమాల్లో నటించారు.