కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధం ఏంటి..!

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మన నుంచి దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతున్న పాటల రూపంలో ఇప్పటికీ మనతోనే ఉన్నారు. ఆయన మరణంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలు సినిమాలలో ఆయన అందుకున్న రికార్డులు ఎవరు అందుకోలేరనే చెప్పాలి. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన ముందు ఆ తర్వాత అనే అంతగా చెరగని ముద్ర వేశారు.

SP Charan reacts to controversy over Ajith's absence at SPB's funeral |  Entertainment News,The Indian Express

అయితే ఎస్పీ బాలు కుటుంబానికి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు మంచి సంబంధమే ఉందట. ఆ సంబంధం ఏమిటంటే ఎస్పీ బాలు కొడుకు చరణ్, అజిత్ ఇద్దరూ క్లాస్‌మేట్స్, టెన్త్ వరకు ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంతేకాకుండా చరణ్‌తో కలిసి వాళ్ళ ఇంట్లో కూడా ఉండేవారట. అజిత్ కు సెంటిమెంట్లు ఎక్కువగా ఉండేవట.. ఆయన ఏదైనా సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ప్రతిసారి బాలు తనయుడు చరణ్ బట్టలు, షూస్ వేసుకొని వెళ్లేవాడట. అది అజిత్ కు బాగా కలిసి వచ్చిందని కూడా ఎన్నోసార్లు చెప్పాడు. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు.

 అంతేకాదు అప్పట్లో ఎస్పీ బాలు రికమండేషన్‌తోనే గొల్లపూడి మారుతిరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాసరావు దర్శకత్వం వహించే చిత్రానికి హీరో వెతుకుతున్నారని తెలిసి ఎస్పీబాలు.. అజిత్ పేరును గొల్లపూడికి రికమెండ్ చేసాడట. అలా గొల్లపూడి కొడుకు డైరెక్ట్ చేసిన ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో అజిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అజిత్ స్ట్రెయిట్‌గా తెలుగులో నటించిన సినిమా ఇదే.

అంతేకాదు ఆ సమయంలో ఎస్పీ బాలు సహకారంతోనే గొల్లపూడి మారుతిరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాలో అజిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇది అజిత్ స్ట్రైట్ గా తెలుగులో నటించిన తొలి సినిమా కూడా ఇదే. అలా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కుటుంబంతో అజిత్ కు మంచి అనుబంధం కొనసాగుతూనే ఉంది. బాలసుబ్రమణ్యం మాత్రం ఎప్పుడూ అజిత్ తన స్వయం శక్తితోనే హీరోగా ఎదిగారని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు.

Share post:

Latest