మ‌ళ్లీ ర‌చ్చ‌… క‌రాటే క‌ళ్యాణికి మంచు విష్ణు షోకాజ్ నోటీసులు..!

టాలీవుడ్ ప్రేక్షకులకు కరాటే కళ్యాణి గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్స్ తో పాటు, పలు సీరియల్స్ లో విలన్ క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆమెను ఎవరు పట్టించుకోకపోవడంతో. ఇతర విషయాలతో ఎప్పుడూ వివాదాలు ఇరుక్కుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈనెల 28న తెలుగువారి ఆరాధ్య దైవం నటరత్న ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో లక్కారం బండపై 54 అడుగుల శ్రీకృష్ణ అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు.

Sr NTR Idol: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటాం.. సినీనటి కరాటే  కళ్యాణి ఆధ్వర్యంలో ఆందోళన - Telugu News | Actress Karate Kalyani protests  against installation of Sr ...

కృష్ణుడు అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడంపై కరాటే కళ్యాణి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు చెబుతూ ఉద్యమానికి దిగింది. ఈ కార్యక్రమాన్ని కరాటే కళ్యాణి యాదవ సంఘం పేరుతో అడ్డుకుంటానంటూ ప్రకటించింది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిని అంటూ చెప్పుకునే కరాటే కళ్యాణి యొక్క వ్యాఖ్యలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Manchu Vishnu Comments On Karate Kalyani

అయితే కరాటే కళ్యాణి వాఖ్యలపై మా అసోసియేషన్ స్పందించినట్టు తెలుస్తోంది. మా అసోసియేషన్ నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. స్వయంగా మంచు విష్ణువే ఆమెకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఆ కాల్‌లో మీ స్టాండ్ మార్చుకోవాలని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందించింది.

మా నుంచి ఫోన్ వచ్చిన మాట వాస్తవం అని.. అయితే ఈ విషయంలో తన స్టాండ్ మార్చుకోమని మాత్రంమే వారు అడిగారని.. లేకుంటే తనపైక్రమశిక్షణ చర్యలు ఉంటాయిన వారు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. తనతో మంచు విష్ణు మాట్లాడిన మాట వాస్తవం. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు అడ్డు తగలవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ విష‌యంపై త‌న వైఖ‌రి మ‌ర‌ద‌ని ఆమె చెప్పుకోచ్చింది. ఇప్పుడు ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎక్క‌డి దారి తీస్తుందో చూడాలి.