అడ్డంగా బుక్కైన అమితాబ్‌- అనుష్క‌.. చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ పోలీసులు హెచ్చ‌రిక‌లు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, స్టార్ బ్యూటీ అనుష్క శ‌ర్మ అతికి పోయి అడ్డంగా బుక్కైయ్యారు. రీసెంట్ గా అమితాబ్ రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కి వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్క‌గా.. అతడు అమితాబ్ ను గమ్యానికి చేర్చారు. అంతేకాదు, బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. సదరు బైకర్‏కు థాంక్స్ కూడా చెప్పారు అమితాబ్.

మ‌రోవైపు హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బైక్ పై వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే అమితాబ్‌, అనుష్క‌ల సింప్లిసిటీని కొంద‌రు మెచ్చుకున్నా.. మ‌రికొంద‌రు మాత్రం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసుకున్నారు. ముంబైలో బైక్ రైడర్ తో పాటు వెనక కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంది.

కానీ, ఈ రూల్ ను అమితాబ్‌, అనుష్క బ్రేక్ చేశారు. బైక్ రైడర్ల‌తో పాటు అమితాబ్‌, అనుష్క హెల్మెట్ ధ‌రించ‌కుండానే జ‌ర్నీ చేశారు. దీంతో ఈ విష‌యంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూల్స్ సామాన్యుల‌కేనా.. సెల‌బ్రిటీల‌కు ఉండ‌వా అంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేశారు. దీంతో ముంబై పోలీసులు వెంట‌నే స్పందించారు. అమితాబ్, అనుష్కలపై కేసు ఫైల్ అయ్యిందని.. వీరిద్దరిపై తప్పకుండ చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు.

Share post:

Latest