అయ్యయ్యో ..మెగా కోంప ముంచేస్తుందే..? శృతి హాసన్ పై ఫ్యాన్స్ గరం గరం.. ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే . కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ మొదటి హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో అందంతో ఎలాగోలా హిట్ అందుకున్న శృతి ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు రాజ్యమేలేసింది . కాగా రీసెంట్గా శృతి బ్యాక్ టు బ్యాక్ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . నందమూరి బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించి ఒక హిట్ సినిమా తన ఖాతాలో వేసుకోగా.. పక్క రోజే రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ప్రజెంట్ శృతిహాసన్ ప్రభాస్ తో సలార్ ..నాని 30, ది ఐ అనే ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది . తాజాగా ఈ భామ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ‘కాన్స్‌’కి ఆహ్వానం అందుకుంది. ఆ ఫెస్టివల్ శృతి లింగ సమానత్వాన్ని గురించి మాట్లాడనుంది. ఈ క్రమంలోనే గతంలో వాల్తేరు వీరయ్య “సినిమా షూటింగ్ టైంలో తనను చాలా ఇబ్బంది పెట్టారని .ఒక సాంగ్ షూటింగ్లో భాగంగా మంచులో డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉండిందని.. హీరోలకు మాత్రం జాకెట్ వేసుకుని డ్యాన్స్ వేయమని చెప్పారని,, తనకు మాత్రం చీరలో డాన్స్ చేయాలి “అంటూ ఫోర్స్ చేసి మరి ఆమె దగ్గర డాన్స్ చేయిచ్చారట .

ఈ కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి. కాగా “కాన్స్‌” ఫెస్టివల్ లో శృతిహాసన్ వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఓపెన్ అప్ అవుతుందా అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ నిజంగా ఇంటర్నేషనల్ ఫీలిం ఫెస్టివల్ లో అమ్మడు చిరంజీవి సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్ చేస్తే అది మెగా ఫ్యామిలీకి అవమానం అంటున్నారు జనాలు. అంతేకాదు శృతిహాసన్ అలా మాట్లాడకుండా తెలుగు ఇండస్ట్రీ పరువును నిలబెట్టాలి అని చెప్పుకొస్తున్నారు..చూద్దాం శృతి హాసన్ ఏం చేస్తుందో..?

Share post:

Latest