టాలీవుడ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు తల్లి పాత్రలో అందాల నటి భాగ్యశ్రీ నటిస్తుంది . ఈ సినిమాను వివి వినాయక్ డైరెక్టర్ చూస్తున్నాడు . కాగా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ క్రమంలోని ట్రైలర్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ నటనను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటనను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్‌స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు .
మరీ ముఖ్యంగా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా సరే తెలుగు చత్రపతి సినిమాకి డిట్టోగా ఉంది తప్పిస్తే ఎక్కడ కొత్తదనం అనేది లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తెలుగు చత్రపతి సినిమాకి మ్యూజిక్ ఎంత హైలెట్ అయిందో హిందీ చత్రపతి సినిమాకి మ్యూజిక్ అంత డిజాస్టర్ గా మారిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. సినిమాలో భాగ్యశ్రీ నటన తప్పిస్తే ఎక్కడ కూడా పాజిటివ్ వైబ్స్ లేవు అంటూ చెప్పుకొస్తున్నారు .మరీ ముఖ్యంగా చత్రపతి సినిమాలో ప్రభాస్ ని చూసిన ఆ కళ్ళు చత్రపతి హిందీ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చూస్తే కచ్చితంగా సినిమాపై నెగటివ్ కామెంట్స్ ఇవ్వడం పక్కా అంటున్నారు .
ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తోనే ఇన్ని నెగిటివ్స్ క్రియేట్ చేసుకుంది.. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ పరిస్థితి ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు . మొత్తానికి హిందీ చత్రపతి ట్రైలర్ తో తెలుగు సినిమాపరువుని బాలీవుడ్ లో తీసేసాడు అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి మే 12న ఏం జరగబోతుందో ..?ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ అందుకుంటుందో..?