అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా సెట్ అయ్యాడు. అఖిల్ మాత్రం హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ సమయంలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా చేశాడు.
రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఈ సినిమాతో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. ఈ సినిమా ఫెయిల్యూర్ పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా సరైన స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్ళామంటూ ఓపెన్ గానే కామెంట్ చేశారు.. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే అఖిల్ సినీ కెరీర్ పై నాగార్జున చాలా డిస్టర్బ్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
వరుస సినిమాలు ఫ్లాప్ అవడం అసలు అఖిల్ హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అనే టెన్షన్ లో నాగార్జున ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం ఇలా ఉంచితే అఖిల్ సినీ కెరీర్ ఎలా ఉన్న పర్సనల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ అవ్వాలని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలోనే నాగార్జున, అఖిల్ కు పెళ్లి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక గతంలో అఖిల్‌కు ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాడు. చైతన్య పెళ్లి చేసుకుని కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు అఖిల్ పర్సనల్ లైఫ్ ఇలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా చేయాలని నాగార్జున భావిస్తున్నాడట. అతి త్వరలోనే అఖిల్ కు పెళ్లి చేయాలని నాగార్జున చూస్తున్నట్లుగా తెలుస్తుంది.