అక్కినేని అఖిల్ నట వారసుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. మొదట సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్.. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తేరకెక్కించిన ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. తర్వాత ఆ తర్వాత అఖిల్ నటించిన హలో సినిమా అఖిల్ ని పరవాలేదు అనిపించేలా చేసింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలు కాస్త ఊరటనిచ్చాయి.అయితే ఈ సినిమాల తర్వాత ఈసారి పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ ని చవిచూసింది.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే అఖిల్ ఏజెంట్ సినిమాకి చేదు ఫలితం రావడం మీద సినీ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో అక్కినేని అఖిల్ పరిస్థితి ఏమి బాగాలేదని ఆయన ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కదని కామెంట్స్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు మరొకసారి మీడియా ముందు అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని ఈ దోషం ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎవరు సలహాలు పట్టించుకోకూడదని వేణు స్వామి వెల్లడించారు
సాధారణంగా జాతకాల ప్రకారం తల్లి చంద్రుడికి తండ్రి సూర్యుడికి సంకేతం అని అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి అఖిల్ తల్లి అమల ప్రమేయం ఆయన జీవితానికి అసలు ఏ మాత్రం కలిసి రాదని తెలిపారు. అఖిల్ పతనానికి జాతకరీత్యా ఆయన తల్లి కారణమంటూ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.