సమంత నుంచి పూజా హెగ్డే వరకు చైతు పరిచయం చేసిన ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా..!

అక్కినేని ఫ్యామిలీ వంటి అగ్ర సినీ కుటుంబం నుంచి వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో హీరోగా నిల‌దొక్కుకున్నాడు.. కానీ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరలేకపోతున్నాడు. చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంకా టైర్-2 హీరోల లిస్ట్ లోనే నాగచైతన్య ఉండిపోయాడు. ఇకపోతే నాగచైతన్య తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ లిస్ట్ లో సమంత నుంచి పూజా హెగ్డే వరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Josh Movie: విరబూసిన అరవిందాలు ఆమె కళ్లు.. 'జోష్' సినిమా హీరోయిన్ ఎలా  మారిందో చూశారా ?.. ఇప్పుడేం చేస్తుందంటే.. | Do You Remember Akkineni Naga  Chaitanya First Movie Josh ...

నాగచైతన్య తొలి సినిమా ‘జోష్’ మూవీ ద్వారా సీనియర్ హీరోయిన్ రాధ పెద్ద కూతురు కార్తిక నాయ‌ర్ హీరోయిన్ గా పరిచయమైంది. చైతన్య హీరోగా వచ్చిన రెండో సినిమా ‘ఏం మాయ చేసావే’ ఈ సూపర్ హిట్ సినిమాతో సమంత టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే ఏర్ప‌డ్డ పరిచయమే చైతు, సమంతల మధ్య ప్రేమ, పెళ్లి చివరకు విడాకుల వరకు దారి తీసింది.

Know the Tamil Divas Who Made Their Debut Opposite Naga Chaitanya

బుట్ట బొమ్మ పూజా హెగ్డేను కూడా నాగచైతన్య టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. చైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పూజా తెలుగులో అడుగుపెట్టింది. అలాగే ‘ప్రేమమ్‌’ సినిమాతో మడోనా స్టెబాస్టియన్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక అదే విధంగా ‘బెజవాడ’ మూవీతో హాట్ బ్యూటీ అమలాపాల్ కూడా టాలీవుడ్‌కు పరిచయమైంది.

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ  ఇచ్చిన మజిలీ బ్యూటీ - Time2news.com

చైతన్య- సమంత జంటగా నటించిన మరో సినిమా ‘మజిలీతో’ దివ్యాంశ కౌశిక్ అనే కొత్త భామను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అలాగే చందూ మొండేటి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘సవ్యసాచి’ సినిమా ద్వారా నిధి అగ‌ర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదేవిధంగా గౌతమినన్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ద్వారా మంజిమా మోహన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు నాగచైతన్య. ఇలా నాగచైతన్య ఎందరో స్టార్ హీరోయిన్లను తన సినిమాలతో తెలుగు తెరకు పరిచయం చేశాడు.

Share post:

Latest