టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టింది కాజల్.. చందమామ సినిమాతో
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బృందావనం, మగధీర సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది కాజల్. ఈమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది.
స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు వస్తున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గత సంవత్సరం ఓ బాబు కూడా జన్మించాడు. మళ్లీ కాజల్ తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించింది. మరలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో కమలహాసన్- శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2, అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ విషయాలు పక్కన పెడితే గతంలో కాజల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సాధారణంగా సినీ తారల ఎఫైర్ వార్తలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా కాజల్ పై కూడా చాలా ఏళ్ల క్రితం ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అదేమిటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కాజల్ ప్రేమలో పడిందని, బన్నీతో సీక్రెట్ గా ఎఫైర్ నడుపుతుందని మీడియా కోడై కూసింది. బన్నీ- కాజల్ తొలిసారిగా ఆర్య 2 సినిమాలో కలిసి నటించారు.
2009లో వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరు విజయం అందుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే బన్నీ- కాజల్ మధ్య ప్రేమ నడుస్తుందని వార్తలు యమ జోరుగా వినిపించాయి. అదే సమయంలో ఓ మీడియా ఫంక్షన్ లో కాజల్‌ను కూడా ఓ రిపోర్టర్ ఇదే విషయంపై నేరుగా ప్రశ్నించగా.. దానికి కాజల్ నేను ఏ హీరోతో రిలేషన్ లో లేనని తేల్చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలపై పులిస్టాప్ పడింది.