ఇదంతా టార్చర్ అంటూ వైరల్ అవుతున్న సమంత పోస్ట్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం సమంత చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి.ఇటీవలే ఈమె నటించిన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది సమంత. ఒకవైపు మయోసైటీ సమస్యతో బాధపడుతుంటే.. మరొకవైపు సిటా డెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంటూ ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంటులు చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని ది ఫ్యామిలీ మెన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

ఇందులో వరుణ్ ధావన్ ,సమంత జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం బాగానే కష్టపడుతున్నది.సమంత షూటింగ్ సమయంలో భాగంగా రెండు చేతులకు గాయమైన ఫోటోలను కూడా గతంలో ఒకసారి షేర్ చేసింది. అలాగే ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంట్ చేస్తున్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేసింది సమంత. తాజాగా ఒక ఫోటోను షేర్ చేసిన సమంత ఇట్స్ టార్చర్ టైం అంటూ రాసుకుంది.ఇందులో ఐస్ బాత్ డబ్బులు కూర్చుని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. భారీ యాక్షన్ సీక్వెల్ కావడంతో అయస్ బాధతో ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది.ఇదే కాకుండా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి చిత్రంలో కూడా నటిస్తోంది ఈ చిత్రాన్ని శివ నిర్మాణ దర్శకత్వంలో వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాకు మంచి హైట్ ను తీసుకొస్తున్నాయి.

Share post:

Latest