టాలీవుడ్ లో మెగా డాక్టర్ నిహారిక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా నిహారిక కొనిదెల తన భర్త నుండి దూరంగా ఉంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు మరిన్ని తెరపైకి వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా నిహారిక సైతం పెళ్లి ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. దీంతో వీరీద్దరు విడాకులు తీసుకోవడం కాయమే అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.
నిహారిక విడాకుల విషయంపై నాగబాబు సైతం అసలు మాట్లాడలేదు. మెగా కుటుంబం కూడా స్పందించలేదు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు ఎక్కువగా సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ తన కూతురు లైఫ్ విషయంలో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండడంతో ఈ విషయం నిజమేనా అని పలువురు నెటిజన్ సైతం నమ్ముతున్నారు. ఇటీవల నిహారిక కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది .హైదరాబాదులో ఆఫీసు ఓపెన్ చేసిన నిహారిక నిర్మాతగా కూడా వ్యవహరించడానికి సిద్ధమయ్యింది. దీంతో పింక్ ఎలిఫెంట్ అని పిక్చర్ బ్యానర్లు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ మూవీస్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
నిహారిక ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా వెంకట చైతన్య హాజరు కాలేదు. దీంతో మరొకసారి ఈ అనుమానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా నిహారిక ఒక వీడియోని షేర్ చేసింది ఆమె వ్యాయామం చేస్తూ వీడియోని పంచుకోవడంతో ఆ వీడియో కి కొన్ని కామెంట్లు జోడించారు..అలాగే అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుందని ఆమె ఒక పాయింట్ ఈ వీడియోలో జోడించింది ఇవన్నీ చూస్తూ ఉంటే విడాకుల బాధ నుంచి నిహారిక బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram