ఎక్కువ మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక అలా వస్తున్న వారు కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశాము అనే విధంగా కాకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే చాలామంది అగ్ర హీరోలు భయపడతారు.

Ravi Teja : అత్యధిక మంది దర్శకులను పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..? | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

అగ్ర దర్శకులుగా ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను ఎక్కువగా పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ హీరో పరిచయం చేసిన చాలామంది దర్శకులు ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనే స్టార్ దర్శకులుగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా.. మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ కొత్త దర్శకులను పరిచయం చేస్తూనే ఉంటాడు.

ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా ఉన్న హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, బాబీ, అనిల్ రావిపూడి ఇలా ఎందరినో రవితేజ త‌న‌ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా అయ్యారు కాబట్టే తనలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని రవితేజ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు.

Share post:

Latest