యంగ్ హీరో శర్వానంద్ కు ఏమైంది.. ఈ నిశ్శ‌బ్దానికి కార‌ణం ఏంటి…!

టాలీవుడ్ యువ హీరోల్లో టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ కి బ్యాడ్ టైమ్‌ ఇంకా పోలేదని చెప్పవచ్చు. అతను చేస్తున్న సినిమాలు విడుదలకు ముందు మంచి హైప్ వస్తుంది. రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అందుకోలేకపోతున్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫెయిల్ అయ్యాక ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులం ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా మంచి విజయం అందుకోలేకపోయింది.

Sharwanand teams up with Sriram Aditya- Cinema express

ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. అప్పుడెప్పుడో సినిమా అనౌన్స్ చేశాడు శర్వా మధ్యలో పుట్టినరోజు సందర్భంగా ఓ లుక్ ను విడుదల చేశాడు. మళ్లీ ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటికి ఇవ్వలేదు. శర్వానంద్ సడెన్ గా ఇంత సైలెంటుగా మారడానికి కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

Krithi Shetty approached for Sharwanand's next - JSWTV.TV

శర్వానంద్ 35వ‌ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో అయినా శర్వానంద్ తిరిగి ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేయాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. మరి శర్వానంద్ త‌న‌ అభిమానుల కోరికను నెరవేర్చుతాడో లేదో చూడాలి.

Share post:

Latest