వయసులో తనకంటే పెద్ద హీరోయిన్ పై అఖిల్ అక్కినేని మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ తో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను కూడా బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షోలో అఖిల్ పాల్గొన్నాడు. అక్కడ సుమ `అవకాశం వస్తే ఏ హీరోయిన్ తో డేట్ కి వెళ్తారు..?` అని ప్రశ్నించింది.
అందుకు అఖిల్ ఏ మాత్రం ఆలోచించకుండా పూజా హెగ్డే పేరును చెప్పి.. ఆమెపై ఉన్న తాను ఇష్టాన్ని చాటుకున్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వయసులో అఖిల్ కంటే పూజా హెగ్డే పెద్దది. వీరిద్దరికీ మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. దీంతో నీకంటే మూడేళ్లు పెద్ది అయినా పూజా హెగ్డేతో డేట్ కి వెళ్తావా అంటూ అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ సమాధానికి షాక్ అవుతున్నారు.