ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా నడుస్తుంది. యంగ్ హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్స్ వరుస సినిమాలతో దూసుకెళ్లుతున్నారు. సీనియర్ హీరోల హవా చూసి యంగ్ హీరోలు కూడా నోరెళ్ళబెడుతున్నారు. షూటింగ్ స్పాట్ కి కూడా కరెక్ట్ గా 8 గంటలకే వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న దర్శకుడు హర్ష, శివ రాజ్ కుమార్, బాలకృష్ణ, రజనీకాంతులతో కలిసి ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ ని చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు బాలకృష్ణ, శివరాజ్ కుమార్ ను అతిథిగా పిలిచారు. బాలకృష్ణ పిలవగానే వెంటనే శివరాజ్ కుమార్ ఆ వేడుక హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకకు శివ రాజ్ కుమార్ తో పాటు హర్ష కూడా వెళ్ళాడు. అక్కడే హర్షను బాలకృష్ణకు పరిచయం చేసి అతని మనసులో ఉన్న మాటను చెప్పించాడు. శివ రాజ్ కుమార్,బాలకృష్ణ, రజనీకాంత్ లను పెట్టి ఒక మల్టీ స్టరర్ సినిమా తీయాలనుకుంటున్నట్లు బాలకృష్ణకు చెప్పారట.
వెంటనే బాలకృష్ణ మరో మాట మాట్లాడకుండా స్క్రిప్ట్ తీసుకొని తన దగ్గరికి రమ్మని దర్శకుడు హర్ష కి చెప్పారట. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ, రజనీకాంత్, శివరాజ్ కుమార్ల పాత్రలు సమానంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ నుండి ‘కేజిఎఫ్’ సినిమాతో ప్రశాంత్ నీల్, ‘కాంతారా’ సినిమాతో రిషబ్ శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు దర్శకుడు హర్ష కూడా మల్టీ స్టార్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి సక్సెస్ ని సాధించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో బాలకృష్ణ కూడా కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది.