స్టార్ హీరో వార్నింగ్‌తో మాట మార్చిన హన్సిక.. ఏం జరిగిందంటే..

ప్రముఖ నటి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలో, సీరియల్స్ లో నటించింది. అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాలో హీరోయిన్‌గా చేసి తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకొని ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ వైట్ బ్యూటీ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషలలో కూడా నటించింది.

ఈ పాలరాతి బొమ్మ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ లాంటి పలువురు స్టార్ హీరోల సరసన కూడా యాక్ట్ చేసింది. సినిమాల్లో మంచి నటనతో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రియల్ లైఫ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోండి. ఎంతో మంది అనాథలకు కడుపు నింపింది. ఈ తార గత ఏడాది ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ ఎపటికప్పుడు తన భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. పెళ్లి తరువాత కూడా పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ పంట పండిస్తూనే ఉంది. ఇంతవరకు బానే ఉంది కానీ ఈ మధ్య హన్సికకి సంబందించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే.. హన్సికకి గతంలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో గట్టి వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. అంతేకాకుండా హన్సికని కమిట్మెంట్ కూడా అడిగాడని సమాచారం. అయితే ఈ వార్త హన్సిక చెవిలో పడగానే వెంటనే ఆమె ఆ వార్తపై స్పందించింది. ఒక వార్త రాసేముందు అందులో ఎంత నిజం ఉందో అని తెలుసుకోరా అని ప్రశ్నించింది. ఒకసారి ఎవరి మీద అయిన వార్త రాసేముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండని చెప్పింది. అయితే కొంతమంది మాత్రం హన్సికకి నిజంగానే ఎవరో స్టార్ హీరో వార్నింగ్ ఇచ్చి ఉంటాడు, అందుకే ఆమె ఒక రేంజ్ లో రెస్పాండ్ అవుతుందని అంటున్నారు. ఆ స్టార్ హీరో ఫోన్లు వార్నింగ్ ఇవ్వడంతో హన్సిక మాట మార్చేస్తుందని చాలా మంది అంటున్నారు.

Share post:

Latest