బాహుబలి: ఆ ఒక్క రీజన్ తో బంగారం లాంటి “అవంతిక” పాత్రను మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఈమె..!!

బాహుబలి .. ఈ పేరు చెప్పగానే మనకు తెలియకుండానే ఏవేవో సీన్స్ మెదులాడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ సినిమాని తెరకెక్కించాడు రాజమౌళి . ఈ సినిమా ఎన్ని రికార్డు లు కొల్లగొట్టిందో ఎన్ని అవార్డును అందుకుందో ప్రత్యేకంగా చెప్పాలా .. ఇప్పటికీ ఏ సినిమా కూడా బాహుబలి సినిమా రికార్డును బీట్ చేయలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కాగా ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి సినిమాలో అనుష్క , తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే బాహుబలిలో తమన్నా పాత్రలో ముందు అనుకున్న హీరోయిన్ వేరే అమ్మాయి అంటూ తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు రాశి ఖన్నా. ఎస్ సింపుల్ రీజన్ తో రాసి ఖన్నా “అవంతిక” రోల్ ను మిస్ చేసుకుందట . ఈ విషయాన్ని స్వయాన రాజమౌళి చెప్పుకు రావడం గమనార్హం.

మనకు తెలిసిందే అవంతిక పాత్రలో ఉన్న తమన్న ఎంత బోల్డ్ గా నటించిందో .. అంతే బోల్డ్ గా రాశి ఖన్నా కూడా నటించడానికి ఓకే అనిందట. అయితే ఆమెకు వాటర్ భయం ఉందట . కొన్ని షాట్స్ లో రాజమౌళి నాచురల్ లుక్స్ కోసం వాటర్ తో షాట్స్ రెడీ చేశారట . అయితే వాటర్ అంటే మొదటి నుంచి భయం ఉన్న రాశి ఖన్నా ఆ షాట్స్ లో డూప్ పెట్టుకోమని చెప్పిందట . అయితే అలాంటివి పెద్దగా ఇష్టపడని రాజమౌళి .. కచ్చితంగా సీన్స్ చేయాలి అంటూ చెప్పుకొచ్చారట. దీంతో తన భయాన్ని పోగొట్టుకోలేక రాశి ఖన్నా ఈ సినిమానే వదులుకున్నట్లు తెలుస్తుంది. దీంతో రాశీ ఖ్న్నా కెరియర్ లో మంచి హిట్ అందుకునే ఛాన్స్ మిస్ అయింది అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా సరే రాశి ఖన్నా కన్నా తమన్న ఈ పాత్రలో బాగా నటించిందని ..బాగా ఇమిడిపోయిందని ..బాగా సూట్ అయింది అని అంటున్నారు అభిమానులు..!!

Share post:

Latest