భైరవద్వీపం రీ-రిలీజ్‌ చేసేందుకు రెడీ.. బర్త్‌డే నాడు బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..

ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో సూపర్ హిట్టైన వాటిని మరోసారి రిలీజ్ చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు త్వరలోనే రాబోతుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఆయన నటించిన ఓ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

‘భైరవద్వీపం’ బాలయ్య కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా టీవీల్లో ఆ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అద్భుతమైన సినిమాల్లో ‘భైరవద్వీపం’ సినిమా కూడా ఒకటి. ఈ అద్భుతమైన చిత్రాన్ని ఇప్పుడు 4Kలో రీరిలీజ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా భైరవద్వీపం సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అప్పట్లో ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడలేని వారంతా ఇప్పుడు వెండితెరపై బాలయ్య నటించిన భైరవ ద్వీపం సినిమాని చూసే అదృష్టం వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక బాలకృష్ణకి కూతురు పాత్రలో శ్రీ లీల కనిపించబోతుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.

 

Share post:

Latest