పెళ్లి మండ‌పంలో స‌మంత‌ను చూడ‌గానే ఏడ్చేశా.. శోభిత షాకింగ్ పోస్ట్ వైర‌ల్‌!

శోభిత‌ ధూళిపాళ్ల.. గ‌త కొద్ది రోజుల నుంచి ఈ పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగిపోతోంది. యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌తో శోభిత డేటింగ్ చేస్తుందంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ పిక్ ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ఇలాంటి త‌రుణంలో శోభిత పెట్టిన ఈ పోస్ట్ వైర‌ల్ గా మారింది.

`ఎన్నో కొత్త ముఖాలు ఇప్పుడే మొదటిసారిగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ముస్తాబు అవ్వ‌డానికి టైమ్‌ లేకుండా పోయింది. కానీ పెళ్లి మండపంలో సమంతను మొదటిసారి చూడగానే ఏడ్చేశాను.` అంటూ పెళ్లి మండపంలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.

అలాగే సంగీత, మెహందీ వేడుక గురించి చెబుతూ మరికొన్ని ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దీంతో శోభిత పోస్టులు కాస్త వైరల్ గా మారాయి. కాగా శోభిత సోదరి సమంత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కింది.

ఈ నేపథ్యంలోనే శోభిత ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. మెహందీ, సంగీత్‌ అంటూ పెళ్లికి ముందు వేడుకలు ఘ‌నంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలనే శోభిత సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

https://twitter.com/sobhitaD/status/1642574269560287233?s=20

https://twitter.com/sobhitaD/status/1642587705124229121?s=20