`ఏజెంట్‌` వంటి డిజాస్ట‌ర్ క‌థ‌ను ఎన్ని కోట్లు పెట్టి కొన్నారో తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు.

భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్ డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. అఖిల్ ఎంతో శ్ర‌మించిన‌ప్ప‌టికీ.. క‌థ‌, క‌థ‌నంలో ద‌మ్ము లేద‌ని తేల్చేశారు. దీంతో క‌లెక్ష‌న్లు కూడా అంతంగా మాత్రంగానే వ‌స్తున్నాయి. రూ. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బిరిలోకి దిగిన ఈ చిత్రం ప‌ది కోట్ల రూపాయిలు రాబ‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మే అని అంటున్నారు.

ఇక‌పోతే ఈ మూవీకి వక్కంతం వంశీ కథ అందించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ రేసుగుర్రం వంటి సూప‌ర్ హిట్‌ సినిమాలకు కూడా వక్కంతం వంశీనే స్టోరీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏజెంట్ క‌థను వ‌క్కంతం వంశీ ద‌గ్గ‌ర‌ మేక‌ర్స్ ఏకంగా రూ. 2 కోట్లు పెట్టి మ‌రీ కొన్నార‌ట‌. క‌ట్ చేస్తే సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. దీంతో ఇలాంటి డిజాస్ట‌ర్ క‌థ కోసం అంత ఖ‌ర్చు పెట్టారా అంటూ నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు.

Share post:

Latest